ప్రకాశం జిల్లా అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో బాషాతో ప్రసాద్ అనే రైతు ఘర్షణకు దిగాడు. పాసుబుక్ కోసం రెండేళ్లుగా తిరుగుతున్నానని.. అయినా పట్టించుకోవటం లేదని ఆరోపణలు గుప్పించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల స్థాయి పెరిగింది. పాసుబుక్ కోసం వీఆర్వో ప్రసాద్ లంచం అడిగాడని.. రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ కూడా తలపై చేయి పెట్టి ఒట్టు వేసుకున్నారు. సోమవారం జరిగిన ఈ వ్యవహారం అంతా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
వీఆర్వో ఏమన్నారంటే...
రైతుకు సంబంధించిన భూమిలో ప్రస్తుతం ఇటుక బట్టి నిర్వహిస్తున్నారని.. కన్వర్షన్ చేసుకోవాలని వీఆర్వో బాషా తెలిపారు. తాను నిజాయితీగా విధులు నిర్వరిస్తున్నారని.. గతంలో తనపై ఎలాంటి ఆరోపణలు లేవని చెప్పారు. తనపై దౌర్జన్యానికి దిగారని..ఈ ఘటను పోలీసులతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
ఈ ఘటనపై స్థానిక తహసీల్దార్ వివరణ కోరగా.. వ్యవసాయ భూమిని ఇటుక బట్టిగా వాడుతున్నారని..ఈ క్రమంలో తప్పనిసరిగా కన్వర్షన్ చేసుకోవాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దర్శన టికెట్ల సంఖ్య పెంపు