ETV Bharat / state

'ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గాలి' - ఒంగోలు వార్తలు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు నిరసన చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.

CITU leaders protest
కేంద్రం వెనక్కి తగ్గాలి
author img

By

Published : Feb 18, 2021, 6:13 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు నిరసన చేపట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో కేంద్ర కార్మిక సంఘాలు, ఒంగోలు డైరీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగులకు అనేక ఇబ్బందులు కలుగుతాయని ఏఐటీయూసీ కార్యదర్శి చౌదరి పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

వైకాపా-తెదేపా వర్గాల మధ్య శిలాఫలకం రగడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.