ప్రకాశం జిల్లా కొమరోలు పురుషోత్తం పల్లి రోడ్డులోని ఓ ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఇంట్లోని బీరువా పగలగొట్టి 5 తులాల బంగారం, 7 తులాల వెండితో పాటు నగదును దోచుకెళ్లారని బాధితులు తెలిపారు.
ఇంటి యజమాని, వారి కుటుంబ సభ్యులు ఇంటి పైన నిద్రిస్తున్న సమయంలో దొంగతనం జరిగింది. సీఐ సుధాకరరావు, కొమరోలు ఎస్ ఐ మల్లికార్జునరావు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంను రంగంలోకి దించారు. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: