ETV Bharat / state

rosaiah with Chirala: రోశయ్య మరణాన్ని తట్టుకోలేకపోతున్న చీరాల ప్రజలు - రోశయ్య కన్నుమూత

Rosaiah with Chirala: ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య మరణం​ ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో తీవ్ర విషాదం నింపింది. రోశయ్య స్వగ్రామం గుంటూరు జిల్లా వేమూరు అయినప్పటికీ చీరాల నియోజకవర్గంతో విడదీయరాని బంధం ఉంది.

రోశయ్య
రోశయ్య
author img

By

Published : Dec 4, 2021, 11:58 AM IST

Updated : Dec 4, 2021, 12:07 PM IST

Rosaiah with Chirala: ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇక లేరన్న వార్త ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో తీవ్ర విషాదం నింపింది. రోశయ్య స్వగ్రామం గుంటూరు జిల్లా వేమూరు అయినప్పటికీ చీరాల నియోజకవర్గంతో విడదీయరాని బంధం ఉంది. చీరాల నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చీరాల వచ్చినప్పుడల్లా అందరిని పేరుపేరునా పలకరించడం రోశయ్య ప్రత్యేకత. చీరాలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్​ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య.. 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్ర గవర్నర్​గా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నర్​గా తన సేవలు అందించారు.

ఇదీ చదవండి:

rosaiah passes away: రేపు హైదరాబాద్​ మహా ప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు

Last Updated : Dec 4, 2021, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.