ప్రజలకు అందాల్సిన మౌలిక సదుపాయాల పట్ల అలసత్యం వహిస్తే ఊరుకునేది లేదని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన తొలి కౌన్సిల్ సమావేశంలో పట్టణంలోని 33 వార్డులకు చెందిన కౌన్సిలర్లు, అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు.
పట్టణంలోని రహదారులు, గృహ నిర్మాణంపై సభ్యుల మధ్య వాడీవేడి చర్చ సాగింది. కొత్త పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగిన మొదటి సమావేశంలో ఎజెండాలోని 15 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. చీరాల పట్టణంలో నిర్మించిన 1850 మంది పేదల ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని.. వాటిని వెంటనే ఆధునీకరించి లబ్దిదారులకు అందజేయాలని గృహనిర్మాణ శాఖ డీఈ రామచంద్రరావును ఎమ్మెల్యే ఆదేశించారు.
దీంతో పాటు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవటంతో వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఏసయ్య, పట్టణంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:.