ప్రకాశం జిల్లా చీరాలలో భాజపా నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయటంపై ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం కూడలిలో మోదీ జిందాబాద్, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు.
ఇది కూడా చదవండి.