ETV Bharat / state

రాజులు, రాజ్యాలు పోయినా.. జనం దాహార్తి తీరుస్తున్న 'చట్టు బావి' - prakasam district latest news

Fresh Water in Chattu Bavi: నదీ జలాలను శుద్ధి చేసి ఇంటికే సరఫరా చేసినా డబ్బాల్లో అమ్మే నీళ్లకే ఇప్పుడు మార్కెట్లో డిమాండ్‌. కొందరైతే ఇళ్లలోనే.. ఆర్​వో ఫిల్టర్లు అమర్చుకుంటున్నారు. కానీ ఆ ప్రాంత ప్రజలు తరతరాలుగా చట్టు బావి నీళ్లే తాగుతున్నారు. ఇంతకీ ఏంటా జలాల ప్రత్యేకత..?

చట్టు బావి
చట్టు బావి
author img

By

Published : Jul 15, 2022, 6:02 AM IST

తరతరాలుగా జనం దాహార్తి తీరుస్తున్న 'చట్టు బావి'.. నేటికీ అడుగు కనిపించేంత స్వచ్ఛంగా జలాలు

ఇదిగో ఇదే చట్టు బావి.. పైనుంచి చూసి చిన్నదే కదా అని తీసి పారేయకండి. మనకు చిన్నదే కావచ్చు. కానీ ప్రకాశం జిల్లా కనిగిరి శివారు ప్రాంతాలకు.. ఇదే నీటి వనరు. ఇందులో నీళ్లు చూడండి ఎంత స్వచ్ఛంగా కనిపిస్తున్నాయో.

ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతాన్ని కాటమ రాజులు, ఉదయగిరి రాజులు ఏలారని చరిత్ర చెప్తోంది. కాటమ రాజుల కాలంలో కనిగిరిని దుర్గంగా పిలుస్తుండేవారు. ప్రజలకు, అప్పటి భటులకు దాహార్తిని తీర్చడానికి ఆనాటి పాలకులే దీన్ని తవ్వించారని స్థానికులు చెప్తున్నారు. రాజులు, రాజ్యాలు పోయినా నేటికీ ఈ బావి ప్రజల దాహార్తి తీరుస్తూనే ఉంది. సుమారు 30 అడుగుల లోపల బండరాళ్లను గోడలుగా పేర్చి దీన్ని నిర్మించారు. రాతి పొరల నుంచి ఊట ఈ బావిలోకి చేరేలా.. కొండ దిగువన బావిని నిర్మించారు. కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉంటుంది. కానీ ఈ బావిలో జలాలు స్వచ్ఛంగా ఉంటాయని, వడపోత అక్కర్లేకుండా తాగుతామని.. స్థానికులు చెప్తున్నారు.

సమీప ప్రాంత ప్రజలు ఈ బావిలో నీళ్లనే తోడుకుని తీసుకెళ్తారు. ఇది ఎండిన దాఖలాలే లేవంటు‌న్నారు స్థానికులు. కాకపోతే.. ఈ మధ్యకాలంలో ఆకతాయిలు దీన్ని పాడు చేస్తున్నారు. బావి ఊరి చివరన ఉండడం వల్ల రాత్రి ఇక్కడ చేరి.. పూటుగా తాగి మద్యం సీసాలు అందులో పడేస్తున్నారు. బావి చుట్టుప్రక్కల దుండగులు గుప్తనిధుల కోసం.. తవ్వకాలు కూడా చేస్తున్నారు. బావికి రక్షణ ఏర్పాట్లు చేసి జలవనరును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.