ETV Bharat / state

తల్లిని ఏమార్ఛి.. ఆటోలు మార్చి - దర్శిలో పసిపాప కిడ్నాప్‌

ప్రకాశం జిల్లా దర్శిలో పసిపాప కిడ్నాప్‌ కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు స్పందించి...రెండు గంటల్లోనే నిందితురాలిని పట్టుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు చిన్నారిని అప్పగించారు.

Mariamma, the mother who was touched by the found sin
దొరికిన పాపను హత్తుకున్న తల్లి మరియమ్మ
author img

By

Published : Oct 1, 2020, 12:31 PM IST

అపహరణకు గురైన చిన్నారి

ప్రకాశం జల్లా ముండ్లమూరు మండలం రెడ్డినగర్‌కు చెందిన బాలుడు ఆరుష్‌రెడ్డి కిడ్నాప్‌ మరువక ముందే దర్శిలో మరో పసిపాప కిడ్నాప్‌కు గురికావడం కలకలం రేపింది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించటంతో సంఘటన జరిగిన రెండు గంటల్లోనే నిందితురాలు దొరికిపోయింది. చిన్నారి తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేరింది. దొనకొండ మండలం పోలేపల్లి అంగన్‌వాడీ కార్యకర్తను గుర్తు తెలియని మహిళ కలిసి ఇటీవల జన్మించిన ఆడపిల్లలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుందని, అలాంటి వారు ఉంటే చెప్పాలని నమ్మబలికింది. ప్రతి తల్లీ తన చిన్నారితో ఫొటో దిగితే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయిస్తానని, అందుకు వారిని దర్శికి పంపాలని కోరింది. ఆమె మాటలు నమ్మిన కార్యకర్త నలుగురు తల్లులను తమ పిల్లలతో దర్శికి వెళ్లాలని సూచించింది. దాంతో వారిలో ముగ్గురు తమ భర్తలతో, కొమ్ము మరియమ్మ తన బంధువుతో అక్కడకు మధ్యాహ్నం చేరుకున్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సదరు మహిళ మరియమ్మను నీరసంగా ఉన్నావు, వైద్యశాలకు వెళదామనే నెపంతో ఇతరుల నుంచి వేరు చేసింది. అద్దంకి రోడ్డులో ఉన్న స్టూడియోలో ఫొటో తీసుకురమ్మని చెప్పి ఆమె చేతుల్లోని పాపను తీసుకుంది. ఫొటో తీయించుకొని బయటకు వచ్చిన మరియమ్మకు తన చిన్నారి, మహిళ కనిపించకపోవడంతో చుట్టుపక్కలంతా వెతికి 2 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సీఐ మొయిన్‌ స్పందించి దర్శి, కురిచేడు, ముండ్లమూరు ఎస్సైలను అప్రమత్తం చేశారు. ప్రధాన రహదారుల కూడళ్లలో తనిఖీలు నిర్వహింపజేశారు. ఉల్లగల్లు వద్ద ముండ్లమూరు ఎస్సై సైదులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా దూరం నుంచి గమనించిన నిందితురాలు ముందుగానే ఆటో దిగి మరో ఆటోను అద్దెకు మాట్లాడుకుని మరో మార్గంలో గుంటూరు జిల్లా నూజండ్లకు చేరుకుంది. అక్కడ ఇంకో ఆటో ఎక్కి వినుకొండ వైపు వెళ్లింది. నూజండ్ల నుంచి తిరిగి ఉల్లగల్లు వచ్చిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు ఆపి వాకబు చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో నూజండ్ల చేరుకున్నారు. వినుకొండ వైపు వెళ్లిన ఆటోల వివరాలు తెలుసుకుని డ్రైవర్లకు ఫోన్లు చేశారు. వారిలో ఒకరైన రామిశెట్టి హనుమంతరావు తన వాహనంలో పిల్ల, మహిళ ఉన్నట్లు తెలిపాడు. దాంతో వారు ఇచ్చిన సూచన మేరకు సాయంత్రం 4 గంటల సమయంలో ఆటో మరమ్మతులకు గురైందని గుండ్లకమ్మ వంతెన వద్ద ఆపేశాడు. వెంటనే పోలీసులు అక్కడికి బయలుదేరగా దూరంగా వస్తున్న వారి వాహనాన్ని గమనించిన మహిళ ఆటోలో పిల్లను వదిలేసి పొలంలోకి పరిగెత్తింది. ఆటో డ్రైవర్‌, తోటి ప్రయాణికులు ఆమెను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పాప తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఏదైనా కిడ్నాప్‌ వ్యవహారంతో నిందితురాలికి ప్రమేయముందా అనే కోణంలో విచారిస్తున్నారు.

దొరికిన పాపను హత్తుకున్న తల్లి మరియమ్మ

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.