ఈనెల 5 వతేదీన తెదేపా జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా చిన్నగంజాం రానున్నారని మండల తెదేపా అధ్యక్షుడు పొద వీరయ్య తెలిపారు. ఈ సందర్భంగా తెదేపా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇటీవల రుద్రామాంబపురంలో వైకాపా దాడిలో గాయపడి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న పద్మ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తారని వీరయ్య తెలిపారు. ఆ కుటుంబానికి ఆర్థికసాయం అందజేస్తారని చెప్పారు.
ఇవీ చదవండి.. వేతనాలివ్వాలని... పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన