ETV Bharat / state

కురిచేడు దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి:చంద్రబాబు - చంద్రబాబు లేటెస్ట్ న్యూస్

రాష్ట్రంలో మద్యం ధరలు విపరీతంగా పెంచి... నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యం పాడుచేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. జిల్లాల్లో వైకాపా మద్యం మాఫియా ఆగడాలు పెరిగాయాయన్నారు.కురిచేడులో శానిటైజర్ తాగి తొమ్మిది మంది మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

chandrababu
కురిచేడులో 9 మంది మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి
author img

By

Published : Jul 31, 2020, 12:24 PM IST

ప్రకాశం జిల్లా కురిచేడులో మద్యం దొరక్క శానిటైజర్ తాగి 9 మంది మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవటంతో పాటు..., వైకాపా మద్యం మాఫియా అరాచకాలపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో గత 14నెలలుగా కల్తీ మద్యం దుర్ఘటనలు జరగటం బాధాకరమన్నారు. నాటు సారా, కల్తీ మద్యం.. శానిటైజర్లు తాగి పలువురు చనిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని తెదేపా అధినేత ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మద్యం ధరలు 300శాతానికి పైగా పెంచేశారన్న చంద్రబాబు... నాసిరకం బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యం సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు.. గడ్డివాముల్లో, మొక్కజొన్న మోపుల్లో, లారీల్లో ఎక్కడ చూసినా అక్రమ మద్యం నిల్వలే కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కార్యకర్తలే మొబైల్ బెల్ట్ షాపులుగా మారారని ఆరోపించారు. ద్విచక్ర వాహనాలను మొబైల్ బెల్ట్ షాపుల్లా మార్చి కొత్త సంస్కృతి తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో నాటుసారా తయారీ యథేచ్చగా సాగుతోందని, సారా విక్రేతలదే రాజ్యంగా మారిందని సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్ ధ్వజమెత్తడం తెలిసిందేనని గుర్తుచేశారు. వైకాపా నేతల దుర్మార్గాలకు అమాయకుల ప్రాణాలు బలికావడం బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

అసలేం జరిగింది...

కురిచేడులో శానిటైజర్ తాగి తొమ్మిది మంది మృతిచెందారు. మద్యానికి బానిసైన వీరు.. లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూసివేయడంతో .. శానిటైజర్ సేవించారు. అధిక మొత్తంలో శానిటైజర్ తీసుకోవడంతో తీవ్రమైన కడుపునొప్పితో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి-ప్రకాశం జిల్లాలో శానిటైజర్​ తాగి తొమ్మిది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.