ETV Bharat / state

అతి వేగానికి ఆరుగురి ప్రాణాలు బలి ! - ప్రకాశంలో రోడ్డు ప్రమాదం

కూలి పనులు కోసం నగరానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న వారిని మృత్యువు కబళించింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

car collided auto in prakasam 3 dead
ఆటోను ఢీకొట్టిన కారు
author img

By

Published : Mar 20, 2020, 9:08 PM IST

Updated : Mar 21, 2020, 3:01 AM IST

మద్యం మత్తులో కారు నడిపిన యువకులు ఐదుగురి ప్రాణాలను బలిగొన్నారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బెల్దారి కూలీలు మృతి చెందడటం వారి కుటుంబాల్లో విషాదం నింపింది. శుక్రవారం సాయంత్రం కొత్తపట్నం మండలం ఈతముక్కల సమీపంలో బకింగ్‌హోమ్‌ కెనాల్‌ వద్ద ఆటోను వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మరణించారు.

కూలీల ఆటోను ఢీకొట్టిన కారు: ఐదుగురు మృతి

మడనూరు, ఈతముక్కల గ్రామాలకు చెందిన కూలీలు ఒంగోలులో బేల్దారి పనులు ముగించుకొని ఆటోలో ఇంటికి చేరేందుకు బయలుదేరారు. ఈతముక్కల గ్రామానికి చేరుకునే సమయంలో ఎదురుగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురిని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్​కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు.

ఒంగోలు రిమ్స్​లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

మడనూరుకు చెందిన బ్రహ్మయ్య, సాధు ప్రియాంక, బిల్లా శ్రీలత, దార్ల సుబ్బులు పల్లెపాలెంకు చెందిన రాసాని గోవిందమ్మ, రాజుపాలెంనకు చెందిన ఆత్మకూరు శ్రీనుగౌడ్​లు ప్రమాదంలో మృతి చెందారు.శ్రీలత, ఆనంద్‌లకు తీవ్రగాయాలవ్వడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. కారులో ఉన్న గుంటూరు కె.ఎల్‌. విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదువుతున్న పవన్‌ కుమార్‌, కౌశిల్‌, దీపక్‌లకు స్పల్పగాయాలయ్యాయి. వీరినీ రిమ్స్‌ తరిలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్‌ పరారిలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : బ్రాడీపేటలో కారులో చెలరేగిన మంటలు...వాహనం దగ్ధం

Last Updated : Mar 21, 2020, 3:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.