ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపల్లె వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ప్రయాణికులంతా అప్రమత్తం కావడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పామూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఇంజిన్ నుంచి పేలుడు శబ్ధం వచ్చింది. వెంటనే డ్రైవర్‌ను ప్రయాణికులు అప్రమత్తం చేశారు. బస్సును రోడ్డు పక్కన నిలిపేశారు. డ్రైవర్‌తో సహా నలుగురు ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకున్నారు. లగేజీలు తీసుకోడానికి వీలుకాలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఓ ప్రయాణికుడికి చెందిన రూ.1.28 లక్షల నగదు మంటల్లో కాలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రకాశం జిల్లాలో విషాదం... ఇద్దరు విద్యార్థులు మృతి