ఆర్టీసీ డ్రైవర్ బస్సు స్టీరింగ్ మీదే పడి మృతిచెందిన విషాదకర సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. పొదిలి డిపోకు చెందిన డ్రైవర్ డి.హనుమంతరావు బస్సును విజయవాడ తీసుకెళ్తున్నారు. ఒంగోలు బస్టాండ్‌కు చేరుకున్నాక ప్రయాణికులు దిగుతున్నారు.
అదే సమయంలో.. హనుమంతరావు స్టీరింగ్ మీదే కుప్పకూలారు. అక్కడున్నవారు గమనించి అధికారులకు తెలియజేశారు. అప్పటికే హనుమంతరావు చనిపోయడని తెలిసింది. హనుమంతరావు స్వగ్రామం చీమకుర్తిగా అధికారులు గుర్తించారు.