ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రభుత్వవైద్యశాలలోని బ్లడ్ బ్యాంక్లో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఒకటవ పట్టణ సీఐ నాగమల్లీశ్వరరావు ప్రారంభించారు. ప్రాణపాయ స్థితిలో ఉన్నవారి కోసం ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చీరాల రెడ్ క్రాస్ ఛైర్మన్ జీ.సుబ్బారావు, సెక్రెటరీ జయప్రకాష్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి...