ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘంపై విమర్శలు చేస్తున్నారని ప్రకాశం జిల్లా భాజపా అధ్యక్షుడు కృష్ణారెడ్డి అన్నారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో ఈసీ పని తీరును అభినందించారు. ఎన్నికల కమిషన్‌కి వ్యతిరేకంగా వ్యవహరించిన చంద్రబాబును అరెస్ట్ చేయాలని కోరారు. దిల్లీలో జీవీఎల్ నరసింహారావుపై దాడిని ఖండించారు. అవినీతి నిర్మూలనకు కృషి చేస్తున్నందుకే తమ పార్టీ నాయకులపై దాడి చేస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి..