ETV Bharat / state

బీరు లోడు లారీ బోల్తా... ఎగబడ్డ మందుబాబులు - Beer Lorry Rolled Over in Mulaguntapadu

Beer Lorry Rolled Over: అసలే సమ్మర్​.. ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో రోడ్డుపై బీరు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ సమాచారం ఆ ప్రాంతమంతా తెలిసింది. అంతే.. జనమంతా ప్రమాద స్థలానికి పరుగులు తీశారు. తమకు బీరు సీసాలు దొరుకుతాయేమోనని ఎగబడ్డారు. ఎవరికి దొరికినవి వారు సంకలో పెట్టుకుని అక్కడినుంచి జారుకున్నారు.

Beer Lorry Rolled Over
Beer Lorry Rolled Over
author img

By

Published : May 22, 2022, 5:05 PM IST

Beer Lorry Rolled Over : ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బీరు లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లెకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో ఉన్న బీరు బాటిళ్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ సమాచారం తెలియడంతో అక్కడికి భారీగా జనం చేరుకున్నారు. బీరు సీసాల కోసం మందుబాబులు ఎగబడ్డారు. ఎవరికి దొరికిన సీసాలు వారు పట్టుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు.

బోల్తా పడ్డ బీరు లారీ...బీరు సీసాల కోసం ఎగబడ్డ మందుబాబులు..

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.