ETV Bharat / state

ఆడపిల్ల పుట్టిందని.. భార్యనే వద్దన్న బ్యాంకు మేనేజర్..!

మాతృదినోత్సవం జరుపుకున్న మరుసటిరోజే ఓ ప్రబుద్ధుడు ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలించుకునేందుకు ప్రయత్నం చేశాడు. తనకు దిక్కెవరని కాళ్లావేళ్లా పడి బతిమిలాడినా.. కనికరించలేదు. ఇంత మూర్ఖంగా వ్యవహరించేది చదవు సంధ్యాలేని నిరక్ష్యాస్యుడు కాదు. ఉన్నత చదవులు చదువి బ్యాంకులో మేనేజర్​గా విధులు నిర్వహిస్తున్నాడా వ్యక్తి!

ఆడపిల్ల పుట్టిందని భార్యనే వద్దన్నాడు
ఆడపిల్ల పుట్టిందని భార్యనే వద్దన్నాడు
author img

By

Published : May 9, 2022, 10:17 PM IST

ఆడపిల్ల పుట్టిందని భార్యనే వద్దన్నాడు

ప్రకాశం జిల్లా కనిగిరి ఎస్​బీఐ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న దాసరి ప్రసాద్​కు అనంతపురం జిల్లాకు చెందిన అనురాధతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన తొలిరోజుల్లో అందిరి లాగే వీరి జీవితం సాఫీగా సాగింది. ప్రసాద్ ఉద్యోగ రిత్యా వివిధ చోట్ల పనిచేస్తూ.. కొద్ది నెలల క్రితం కనిగిరికి బదిలీ అయ్యారు. వీరికి పాప పుట్టినప్పటి నుంచి సంసారంలో కలతలు మెుదలయ్యాయి.

ఆడపిల్ల పుట్టడటంతోనే తన భర్త తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని బాధితురాలు అనురాధ వాపోయారు. గత ఆరు నెలలుగా తనను ఇంట్లోకి రానివ్వటం లేదని అన్నారు. ఇంటికి వెళ్తే.. తన అత్తమామలు కొట్టి తరిమేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని కన్నీరు పెట్టుకున్నారు. కనిగిరి ఎస్​బీఐ ఎదుట ఆందోళన చేస్తున్న అనురాధకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. అనురాధకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి :

ప్రేమించిన యువతిని తుపాకీతో కాల్చి.. ఆపై తానూ కాల్చుకొని..

MURDER: బహిర్భూమికి వెళ్లిన మహిళ దారుణ హత్య.. ఎక్కడంటే?

IPL 2022: అత్యధిక శతకాల వీరులు వీరే.. జాబితాలో కోహ్లీ, రోహిత్ స్థానాలివే..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.