ETV Bharat / state

రెండో రోజు కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె

author img

By

Published : Mar 16, 2021, 5:31 PM IST

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగింది. ఉద్యోగుల సమ్మెకు పలు రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.

bank employees strike in ap
రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ప్రకాశం జిల్లాలో..

బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లాలోని పలు పట్టణాలలో బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు. గిద్దలూరు, చీరాల, అద్దంకి యర్రగొండపాలెంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగులతో పాటు ప్రజా సంఘాల నేతలు సమ్మెలో పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో బ్యాంకు ఉద్యోగులు రెండో రోజు సమ్మెలో పాల్గొన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఎదుట బ్యాంకు ఉద్యోగులు తమ నిరసన వ్యక్తం చేశారు. భాజపా మినహా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలకు చెందిన నేతలు మద్దతు పలికారు.

శ్రీకాకుళం జిల్లాలో..

బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా పాలకొండలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. స్థానిక స్టేట్ బ్యాంకు వద్ద సిబ్బంది ధర్నా నిర్వహించారు. కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

ఇదీ చదవండి

శ్రీకాకుళం జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.