ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాలలో సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నియోజకవర్గంలో నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో దానిమ్మ సాగు చేసే రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొని రైతులకు దానిమ్మ తోట సాగు విధానంలో తీసుకోవాల్సిన సలహాలు, సూచనలు అందజేశారు. చెట్లకు వచ్చే తెగుళ్ళు, కొమ్ముల కత్తిరింపు, నాణ్యతా ప్రమాణాలు.. తదితర అంశాలపై సమాచారాన్ని అందించారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. మార్కెటింగ్‌లో దానిమ్మకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు.
ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో దారుణం... భార్యను హత్య చేసిన భర్త