ప్రకాశం జిల్లా దర్శి మండలం ఎర్రఓనపల్లి రేషన్డీలర్పై అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ పార్టీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో రేషన్ దుకాణం నిర్వహిస్తున్న తెదేపా నాయకుడు చింతా రమణారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన సంజీవరెడ్డికి కూడా స్వల్వ గాయాలయ్యాయి. అనంతరం ఇరువర్గాల వారు దర్శి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువర్గాల ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు ప్రారంభించినట్లు దర్శి ఎస్సై తెలిపారు. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి