ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ ఇంటిపై పెట్రోలు బాంబులు విసరడం కలకలం రేపింది. రెవెన్యూ కాలనీలోని ఓ ఇంటిపై సోమవారం రాత్రి దుండగులు పెట్రోలు బాంబులు విసిరారు. ఇంటి ఆవరణలోని కొన్ని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. రెవెన్యూ కాలనీకి చెందిన కుంచాల మహేశ్‌కు ఒంగోలులోని మంగళపాలెంకు చెందిన హైదర్ అలీ, అక్రమ్ అలీ, గుంటూరు మహేశ్, సుమంత్, గణేశ్‌తో ఆర్థిక విభేదాలు ఉన్నాయి.
కొంతకాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. మహేశ్.. వారిపై తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే కేసు ఉపసంహరించుకోవాలని మహేశ్ కుటుంబంపై మిగిలిన వాళ్లు ఒత్తిడి తెచ్చారు. దీంతో.. మహేష్ కుటుంబ సభ్యులు కేసు ఉపసంహరించుకున్నారు. కేసు వాపసు తీసుకున్నా.. తమపై దాడులకు తెగ పడ్డారని మహేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: