ప్రకాశం జిల్లా ఒంగోలు తెదేపా నగర అధ్యక్షుడు కటారి నాగేశ్వరావుపై కొందరు దాడికి పాల్పడ్డారు. మరాఠీపాలెం వద్ద ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతున్న నాగేశ్వరావుని పది మంది యువకులు అడ్డగించి విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలైన బాధితుడిని స్థానికులు గమనించి నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తెదేపా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకే తనపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారని నాగేశ్వరావు ఆరోపించారు. ఇప్పటికీ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ...తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయకుండా.. తనపైనే ఎదురు కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఇది కూడా చదవండి.
డిప్యూటేషన్ వైద్య సిబ్బందిని వెనక్కి రప్పిస్తాం:మంత్రి బాలినేని