కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా గుంటూరు ఆసుపత్రిలో మృతి చెందిన ఆశ కార్యకర్తకు... ప్రభుత్వం 50 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించాలని, ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మృతురాలి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు దేవ తోటి నాగేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు బి. ఝాన్సీ లక్ష్మి , శారద, స్వప్న, సుభాషిని, షాహిదా... పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌పై ఎస్‌ఈసీ చర్యలు