ETV Bharat / state

ఘనంగా 'ఆసరా' ప్రథమ వార్షికోత్సవం - marellaguntapalem

వృద్ధులందరికీ సహాయం చేయాలనే ఆలోచనతో ఏర్పాటు చేసిన 'ఆసరా' ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. సంతనూతలపాడు నియోజకవర్గంలోని మారెళ్ళగుంటపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

వృద్ధులకు అండ 'ఆసరా' ప్రథమ వార్షికోత్సవం
author img

By

Published : May 20, 2019, 3:07 PM IST

వృద్ధులకు అండ 'ఆసరా' ప్రథమ వార్షికోత్సవం

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మారెళ్ళగుంటపాలెంలో సరోజ్​ సేవా ఫౌండేషన్, ఆసరా పేరుతో స్థాపించిన వృద్ధాశ్రమం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.

1960 నుండి ఒంగోలు సీఎస్​ఆర్​ శర్మ కాలేజీలో చదివిన విద్యార్థులు ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. అప్పటి ప్రజా నాట్య మండలి అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ సంస్థను స్థాపించి ఉన్నత భావాలతో స్థిరపడ్డారు. వృద్ధాప్యంలో ఉన్నత భావాలతో... వృద్ధులందరికీ సహాయం చేయాలనే ఆలోచనతో 'ఆసరా' పేరుతో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు.

మూడున్నర కోట్ల వ్యయంతో ముప్పై ఐదు గదుల ఈ భవనాన్ని అన్ని వసతులతో వృద్ధులకు అవసరమైన రీతిలో ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం శుద్ధ జల కేంద్రం, జిమ్, సుందరమైన పార్కులు, గ్రంధాలయం, రీడింగ్ రూమ్, టీవీ హాల్, నాణ్యమైన భోజనాలతో సదుపాయాలు కల్పిస్తున్నారు. ఏఐఎస్ఎఫ్ స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు ఉన్నత భావాలతోనే జీవించామని నల్లూరి వెంకటేశ్వర్లు తెలిపారు. పేదవారికి సహాయం చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మా సంస్థ యొక్క లక్ష్యంగా వారు తెలిపారు.

ఈ కార్యక్రమానికి సివిల్ జడ్జి రాజా వెంకటాద్రి, సినీ గేయ రచయిత గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ప్రజా నాట్యమండలి గౌరవ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు పలువురు పలువురు పాల్గొని ప్రసంగించారు. వందేమాతరం శ్రీనివాస్ పలు గేయాలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు. గీత అకాడమీ వారి ఆధ్వర్యంలో చిన్నారులు చేసిన నృత్యం ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. వృద్ధాశ్రమం నడపడానికి దానం చేసిన నలుగురిని ఘనంగా సన్మానించారు.

Intro:చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని కొత్త కండ్రిక పోలింగ్ బూత్ లో ప్రశాంతంగా ఓటింగ్ ముగిసింది ఉదయం నుంచి సాయంత్రం వరకు పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ పోలింగ్ నిర్వహించారు 991 ఓట్లకు గాను 841 ఓట్లు పోలయ్యాయి . రీ పోలింగ్ సందర్భంగా వృద్ధులు ఓటుహక్కు వినియోగించుకోడానికి సరైన సౌకర్యం కల్పించకపోవడంతో వృద్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు ఏర్పాటుచేసిన వీల్చైర్లు సైతం సరిపోకపోవడంతో ఓటర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు అనంతరం పోలీసులు తమ వాహనంలో లో ఉన్న తరలించి ఓటు వేయించి తీసుకొచ్చి వదిలారు

Body:nagari

Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.