ప్రకాశం జిల్లా ఒంగోలులో పది రోజుల పాటు ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహిస్తున్నారు. నేటి నుంచి మొదలయ్యే ఈ ర్యాలీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏడు జిల్లాల నుంచి సుమారు 28 వేల మంది అభ్యర్థులు ఆర్మీ నియామక ర్యాలీలో పాల్గొని సైన్యంలో చేరేందుకు పోటీ పడనున్నారు. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కర్నూలు , ప్రకాశం, కడప, గుంటూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు ర్యాలీకి హాజరవనున్నారు.
తొలిరోజు చిత్తూరు, అనంతరపురం జిల్లాలకు చెందిన సుమారు 3400 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పోటీల్లో పాల్గొంటారు. పరుగు పందెం, బీమ్ పులప్స్, కందకం, జిగ్ జాగ్ పోటీలు నిర్వహించి వాటిలో అర్హత సాధించిన వారిని రాత పరీక్షకు అనుమతిస్తామని అధికారులు చెప్పారు. అభ్యర్థులు విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలతో(ఒరిజినల్స్) హాజరుకావాలని నిర్వాహకులు తెలిపారు.
ఆర్మీ ర్యాలీ కోసం ఒంగోలు పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. జోనల్ రిక్రూట్‌మెంట్ చెన్నై, గుంటూరు కార్యాలయాల ఆర్మీ అధికారులు, వైద్యులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది. జిల్లా అధికారులు, పోలీసులు సహకారాన్ని అందిస్తున్నారు.
ఇదీ చదవండి : "విలాస జీవికి పేదల కష్టాలెలా తెలుస్తాయి"