చీరాల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రైవేటు బస్సులో రాజేష్, అజయ్ డ్రైవర్లుగా.. సురేష్ అనే వ్యక్తి క్లినర్గా పనిచేస్తున్నారు. గంగాధర్ అనే వ్యక్తి వీరిద్వారా మద్యం తెప్పించి పర్చూరులో విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి బయల్దేరిన బస్సు పర్చూరు చేరుకుంది. బస్ స్టాండు సమీపంలో 750 ఎంఎల్ పరిమాణం కలిగిన 30 మద్యం సీసాల బస్తా దించారు.
అనంతరం ఆ సరుకు సంబంధించిన డబ్బుల పంపిణీ విషయంలో వివాదం చోటుచేసుకుంది. ముందునుంచే వీరిపై నిఘా ఉంచిన సెబ్ సిబ్బంది వారిని పట్టుకునేందుకు వెళ్లగా.. నలుగురిలో ముగ్గురు పరారయ్యారు. రాజేష్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు త్వరలోనే ఆ ముగ్గురుని పట్టుకుంటామని ప్రకాశం జిల్లా పర్చూరు సెబ్ సీఐ ప్రతాప్ చెప్పారు.
ఇదీ చదవండి: