లాక్డౌన్ కారణంగా గర్భవతులు, బాలింతలకు అందించాల్సిన పోషకాహారాన్ని అంగన్వాడి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అందించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో అంగన్వాడి కార్యకర్తలు బియ్యం, కందిపప్పు, నూనె, పాలు, గుడ్లు తోపుడు బండిపై తీసుకువెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'రేషన్ సరఫరాలో అవకతవకలు నిర్మూలించండి'