ETV Bharat / state

ఆనందయ్య మందుకు క్రేజ్.. పోటాపోటిగా పంపిణీ చేసిన ఎంపీ, మంత్రి! - ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆనందయ్య మందు పంపిణీ న్యూస్

ప్రకాశం జిల్లాలో ఆనందయ్య మందు ఉచితంగా పంపిణీ చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, మంత్రి బాలినేని పోటాపోటీగా పంపిణీ చేపట్టారు.

ప్రకాశం జిల్లాలో ఆనందయ్య మందు పంపిణీ
ప్రకాశం జిల్లాలో ఆనందయ్య మందు పంపిణీ
author img

By

Published : Jun 10, 2021, 10:53 AM IST

Updated : Jun 10, 2021, 3:06 PM IST

కృష్ణపట్నం ఆనందయ్య మందు(anandayya medicine)ను ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉచితంగా పంపిణీ చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. పోటా పోటీగా ఈ మందు పంపిణీ చేయడంతో రెండు చోట్ల జనం కిక్కిరిసిపోయారు. కరోనా(corona) రాకుండా ముందస్తు నివారణలో భాగంగా ఆనందయ్య 'పి' అనే మందు తయారు చేశారు. ప్రభుత్వం(govt) నుంచి అనుమతులు రావడంతో అధికార పార్టీకి చెందిన నేతలు అనందయ్యతో మాట్లాడి పెద్ద ఎత్తున మందును తయారు చేయించి ఒంగోలుకు తీసుకువచ్చారు.

ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, అతడి తనయుడు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఆనందయ్య మందు పంపిణీ చేశారు. పీవీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్​లో పంపిణీకి ఏర్పాట్లు చేశారు. టెంట్లు, బారికేట్లు వేసి పట్టణ పరిధిలో ఉన్న సుమారు 5 వేల మందికి పంపిణీకి అనువుగా మందు సిద్ధం చేశారు. మందు ఉచిత పంపిణీ చేస్తున్నారనే ప్రకటన వెలువడిన వెంటనే అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కృష్ణపట్నం నుంచి మందు తెప్పించారు. నియోజకవర్గంలో 5 వేల మందికి పంపిణీ చేసేందుకు ఆయన ఇంటివద్ద హుటాహుటిన ఏర్పాట్లు చేశారు.

రెండు చోట్ల ఉదయం 9గంటల నుంచి పంపిణీ చేపట్టారు. పంపిణీ చేస్తారన్న సమాచారం తెలుసుకున్న జనం ఆయా నాయకుల కార్యాలయాలకు వెళ్లి టోకెన్లు తీసుకొని అనంతరం పంపిణీ ప్రాంగణాలకు వెళ్లి మందు తీసుకున్నారు. ఒకో ప్యాకట్‌ నలుగురికి వస్తుందని, ఒక రోజు డోసుగా ఈ మందు పంపిణీ చేస్తున్నామని, కరోనా రాని వారికి ఇది ఉపయోగ కరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి: మిత్రులతో ఆ పని చేయాలని భార్యను వేధించి...

Last Updated : Jun 10, 2021, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.