డా. బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి విశ్వరూప్ అన్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో రూ.3 కోట్ల నిధులతో ఆధునీకీకరించిన అంబేడ్కర్ భవనాన్ని రాష్ట్ర మంత్రులతో కలిసి ప్రారంభించారు. బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సే తమ ధ్యేయం అని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాస్, సురేశ్, ఎంపీ మాగుంట శ్రీనివాస్, కలెక్టర్ పోల భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ
Anandaiah: ఔషధ పరీక్షలపై రేపే చివరి నివేదిక: ఆయుష్ కమిషనర్