గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ ఖండించారు. రాజధాని ప్రాంతంలో తెదేపా నాయకులు అక్రమంగా భూములు కొనుగోలు చేశారనే విమర్శలు చేస్తున్న వైకాపా నాయకులు వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష పదకొండో రోజుకు చేరింది. ఆనాడు అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా అంగీకరించిన ముఖ్యమంత్రి జగన్... నేడు ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి :