అమరావతి రైతుల ఉద్యమాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని భారతీయ జనతా పార్టీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నదాతలకు హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా కారంచేడులో పురందేశ్వరితో అమరావతి మహిళలు సమావేశమయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
తమ ఆశయాల కోసం ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం తప్పుడు కేసులతో వేధిస్తోందని మహిళలు వాపోయారు. దీనిపై పురందేశ్వరి సానుకూలంగా స్పందించారు. రైతుల సమస్యలను రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు.
ఇవీ చదవండి...