లాక్డౌన్ కారణంగా నష్టపోయిన చేతి వృత్తుల వారిని ఆదుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన భవన నిర్మాణ కార్మికులు, చేనేతలు, ఇతర రంగాల కార్మికులందరినీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆదుకుని, ఉపాధి కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :