తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అందోళన నిర్వహించారు. ఏఐటీయుసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇంచార్జ్ కమిషనర్ యేసయ్యకు సమ్మె నోటీస్ అందించారు. కరోనా కాలంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైతే పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందించారని నాయకులు బత్తుల శామ్యూల్, కోడె దాసు చెప్పారు.
గత మూడు మాసాలుగా జీతభత్యాలు లేకపోయినా సేవలు చేస్తున్నారని గుర్తు చేశారు. సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నవంబర్ 16 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని కార్మికులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ నాయకులు అచ్యుతుని బాబూరావు, మేడ వెంకట్రావు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: