టి.కృష్ణ కుమారుడిగా జన్మించడం తన అదృష్టమని... మరణించి 30 ఏళ్లు దాటినా అయనపై చూపిస్తున్న ప్రేమ అనిర్వచనీయమని యువనటుడు గోపిచంద్ పేర్కొన్నారు. ప్రజానాట్యమండలి, టి.కృష్ణ మెమోరియల్ కల్చరల్ సొసైటి ఆధ్వర్యంలో... టి.కృష్ణ వర్ధంతి ముగింపు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపీచంద్ హాజరయ్యారు. తన తండ్రి పేరుమీద ఏర్పాటు చేసిన సేవా సంస్థ ద్వారా... చదువుకోలేని వారికి సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. పిల్లలు చదువుకుంటే వారికు నచ్చిన రంగంలోకి వెళ్ళి... జీవితంలో స్థిరపడొచ్చని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నవారిని గోపిచంద్ సత్కరించారు.
ఇదీ చూడండి: 'వాళ్లిద్దరి మధ్య' జరిగిందేంటో డిసెంబరులో తెలుస్తుందా!