ప్రకాశం జిల్లా కనిగిరి మండలం జాతీయ రహదారిపై తెల్లవారు జామున ఘోర ప్రమాదం( Accident at Nandana Marella village) జరిగింది. నందనమారెళ్ల గ్రామ సమీపంలో బొలెరో పార్సిల్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతానికి చెందిన బండారు నరసింహస్వామి (62)గా గుర్తించారు. డ్రైవర్‌కి, మరో ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: gas leak: విశాఖ పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికుల మృతి