ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గోబ్బురు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు పుల్లలచెరువు మండలం మర్రివేముల గ్రామానికి చెందిన భాస్కర్‌గా పోలీసులు గుర్తుంచారు. శిరస్త్రానం ధరించకపోవడం వల్ల ముగ్గురి తలలకే తీవ్ర గాయాలయినట్లు పోలిసులు వెల్లడించారు. హెల్మెట్ పెట్టుకుని ఉంటే, గాయాలతో బైటపడేవారని పేర్కొన్నారు.
ఇది చూడండి: లక్కీడిప్ పేరుతో వసూళ్లు... రూ. 8 కోట్లతో పరార్