ETV Bharat / state

'పునరావాస కేంద్రాల్లో మౌలిక సౌకర్యాల కల్పన వేగవంతం చేయండి'

author img

By

Published : Jul 31, 2020, 8:22 AM IST

ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజనల్ పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. ఇంకా ముంపు గ్రామాల్లో ఉంటున్న ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించాలన్నారు.

'పునరావాస కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు వేగవంతం చేయండి'

ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితుల పునరావాస కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జె.వి.మురళి అధికారులను ఆదేశించారు. మార్కాపురం డివిజనల్ పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకోసం ఏర్పాటు చేసిన మార్కాపురం మండలంలోని ఇడుపూరు 1,2, వేములకోట, గోగులదిన్నే, పెద్దారవీడు మండలములోని దేవరాజుగట్టు, తోకపల్లి, ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల్లో నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రాజెక్టు పునరావాస కేంద్రాల్లో పనులు వేగవంతం

వెలిగొండ ప్రాజెక్ట్​ను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రాజెక్ట్ పునరావాస కేంద్రాల్లో గృహ నిర్మాణం, అంతర్గత సిమెంటు రోడ్లు, అంగన్​వాడి, పాఠశాలల నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఏర్పాటు చేసిన కాలనీల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

ఇవీ చదవండి

పోషక హాహాకారం...!నీళ్ల సాంబారు, మజ్జిగే దిక్కు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.