ప్రకాశం జిల్లాలో ఆధార్ కేంద్రాల వద్ద జనం కిక్కిరిసి పోయారు. మార్కాపురం, గిద్దలూరు లో ఆధార్ కేంద్రాల వద్ద చిన్నారుల వేలిముద్రలు ఆధార్లో నమోదు చేయించుకునేందుకు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. వెలి ముద్రలు నమోదు కాకుండా ఈకేవైసీ లేకపోతే రేషన్ బియ్యం నిలుపుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షంలోని పడిగాపులు కాస్తున్నారు.
మరో పక్క వారం రోజుల వరకు ఖాళీ లేదంటూ ఆధార్ నిర్వాహకులు చెబుతున్నారు. మార్కాపురం లో మొత్తం ఆరు ఆధార్ కేంద్రాలు ఉండగా మూడింటిలో మాత్రమే వేలిముద్రలు నమోదు చేస్తున్నారు. వేలిముద్రలు తీసేందుకు సమయం ఎక్కువ పడుతుందనే నెపంతో సిండికేట్ బ్యాంకు, ప్రధాన స్టేట్ బ్యాంకు , బజార్ స్టేట్ బ్యాంకు లలోని ఆధార్ కేంద్రాల్లో ఆ సేవలు నిలుపుదల చేశారు. దీంతో ఉన్న మూడు ఆధార్ సెంటర్లు సరిపోక తీవ్ర ఉబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్కువ ఆధార్ సెంటర్లను కేటాయించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.