ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన బచ్చకారి హేమంత్‌కు... 4 నెలల క్రితం చీమకుర్తికి చెందిన భవానితో వివాహం అయింది. గ్రామంలో సొంత ఇల్లు కూడా లేని హేమంత్... రైల్వేస్థలంలో రేకులషెడ్ ఏర్పాటు చేసుకుని భార్య, నానమ్మలతో ఉంటున్నాడు. భవానికి తీవ్ర జ్వరంరావడంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు... డెంగీ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో స్థానికంగా ఉండే మరో వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ భవాని మృతి చెందింది. ఆమె మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
ఇదీచూడండి.జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి