ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతైన వ్యక్తి మృతదేహం ప్రకాశం జిల్లా కారంచేడు కొమ్మమూరు కాలువలో లభ్యమయ్యింది. చీరాల మండలం పుల్లాయపాలానికి చెందిన కొమ్మనబోయిన తిరుపతి అంకయ్య(25), నక్కల తిరుపతి అంకన్న కూలీ పనులకు కంకలమర్రు బయలుదేరారు.
మార్గ మధ్యలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ద్విచక్రవాహనంతో సహా పక్కనే ఉన్న కొమ్మమూరు కాలువలో పడిపోయారు. తిరుపతి అంకయ్య వెంటనే ఒడ్డుకు చేరుకోగా.. అంకన్న నీటిలో కొట్టుకుపోయాడు. గల్లంతైన అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: