ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అయ్యవారిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం వైపు వెళ్తున్న గరుడ బస్సు.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది.
ఇదీ చూడండి: