ETV Bharat / state

TDP MAHANADU: తొలిరోజు 'మహా' ప్రభంజనం..మహానాడుకు పోటెత్తిన పసుపుదండు - తెదేపా వార్తలు

నలభై ఏళ్ల వేడుకతో మరొకసారి కొత్త పోరాటానికి కార్యోన్ముఖులం అవుదామని తెలుగుదేశం మహానాడు పిలుపునిచ్చింది. క్విట్‌ జగన్‌, సేవ్ ఆంధ్రప్రదేశ్‌ నినాదంతో ఎన్నికలు ఎప్పుడొచ్చిననా సిద్ధంగా ఉండాలంటూ రాజకీయ తీర్మానం చేసింది. తొలి రోజు మహానాడుకు జనం పోటెత్తడంతో ఒంగోలు తెలుగు తమ్ముళ్లతో కిక్కిరిసిపోయింది. 12 నుంచి 14 వేల మంది హాజరవుతారని భావిస్తే అంచనాలకు అందని విధంగా శ్రేణులు తరలి రావడంతో తొలిరోజు మహానాడు అత్యంత ఘనంగా జరిగింది. అధినేత చంద్రబాబు ప్రసంగంతో యువత ఉర్రూతలూగింది.

TDP MAHANADU
TDP MAHANADU
author img

By

Published : May 27, 2022, 9:31 PM IST

Updated : May 28, 2022, 6:31 AM IST

తొలిరోజు 'మహా' ప్రభంజనం

మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించుకునే పండుగ. పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి సామాన్య ప్రజల వరకూ ప్రతి ఒక్కరూ ఎదురుచూసే కార్యక్రమం. గతంలో జరిగిన విషయాల సమీక్షతో పాటు.. భవిష్యత్తు మార్గనిర్దేశం ఇదే వేదిక మీద జరుగుతుంది. మూడేళ్ల విరామం తర్వాత భారీస్థాయిలో నిర్వహిస్తున్న మహానాడుకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పోటెత్తారు. అనంతపురం నుంచి ఉత్తరాంధ్ర వరకు అభిమానులు తరలివచ్చారు. ఈసారి మహానాడును తొలిరోజు పార్టీ ప్రతినిధుల సమావేశంగానే నిర్వహించాలనుకున్నా...ప్రజలు భారీగా తరలి రావడంతో ఇది బహిరంగ సభగా మారిపోయింది.

ఎన్నికలకు మరో రెండేళ్లే ఉండటం, ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరగడంతో.. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇన్నాళ్లూ అధికార పార్టీ బెదిరింపులు, పోలీసుల నిర్బంధంతో తెదేపా కార్యకర్తలతో పాటు అభిమానులు, మద్దతుదారులు బయటకు వచ్చేందుకు జంకేవారు. ఇప్పటికీ నిర్బంధాలున్నా.. వారిలో తెగింపు వచ్చింది. జడత్వం వదిలింది. ఇటీవల పార్టీ కార్యక్రమమంటే నాయకుల కంటే వారే ముందుగా వస్తున్నారు. మహానాడుకూ అదే తెగింపుతో వచ్చారు. సభకు చిన్న రైతులు, రెక్కాడితే గానీ డొక్కాడని వారు, శ్రామికులు తరలివచ్చారు. తమపై నిర్బంధాలు కొనసాగుతున్నాయని... ప్రభుత్వ పథకాలు ఆపేస్తామన్న బెదిరింపులూ ఉన్నా సభకు వచ్చామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెదేపాను గెలిపించుకొంటామన్నారు.

మహానాడు తొలిరోజు అట్టహాసంగా, మహాత్సవంలా జరిగింది. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలివచ్చారు. వేదికను జాతీయ రహదారి నుంచి 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసినా.. ప్రాంగణం నుంచి జాతీయ రహదారి వరకు మధ్యలో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీలన్నీ నిండిపోయి... పెద్ద సంఖ్యలో జనం నిలబడి కార్యక్రమం తిలకించారు. పార్టీ జెండాలు, బ్యాడ్జీలను ఉత్సాహంగా కొంటూ కనిపించారు. చంద్రబాబు ప్రత్యేక భద్రతా సిబ్బంది, పోలీసులు, వాలంటీర్లు.. ఉత్సాహంగా దూసుకువస్తున్న కార్యకర్తల్ని నిలువరించలేకపోయారు. కార్యకర్తలు చంద్రబాబు ప్రత్యేక వాహనంపైకి ఎక్కేసి మరీ కార్యక్రమాన్ని చూసేందుకు ఉత్సాహం కనబరిచారు. వేదికకు రెండువైపులా కార్యకర్తలు గుమిగూడడంతో... నాయకులు వేదికపైకి వెళ్లేందుకు ఇబ్బందిపడ్డారు. చంద్రబాబు వేదికపైకి వచ్చినప్పుడు... అలాగే ఆయన ప్రసంగం ప్రారంభించినప్పుడు ప్రాంగణమంతా నినాదాలు, ఈలలతో హోరెత్తింది. పార్టీ ముఖ్య నాయకులు ఆవేశ పూరితంగా ప్రసంగించినప్పుడు... వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పుడు పెద్ద ఎత్తున స్పందన కనిపించింది.

వాస్తవానికి ప్రతినిధుల సభకు 12 వేల మందికి వసతి ఏర్పాటు చేసినా అంతకు 5 రెట్లు రావడంతో ఒక దశలో భోజనాలు అందించడం కష్టంగా మారింది. దాదాపు 30 కౌంటర్లు ఏర్పాటు చేసినా రద్దీ తగ్గలేదు. మంచినీళ్లకూ కొరత ఏర్పడింది. సభా ప్రాంగణంలో కూలర్లు లేక ఉక్కపోతతో కార్యకర్తలు ఇబ్బందిపడ్డారు. వాలంటీర్లు తగినంతగా లేకపోవడం... పోలీసులు తక్కువగా ఉండటం వల్ల భారీగా తరలివచ్చిన జనాన్ని నియంత్రించలేకపోయారు.

పొత్తుల గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండానే మహానాడులో.. తెలుగుదేశం రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టింది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా... సిద్దంగా ఉండాలని ప్రస్తావించింది. దూరమైన వర్గాలను తిరిగి దగ్గరకు చేర్చుకోవాలని.. యనమల ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని రావుల చంద్రశేఖర్ రెడ్డి బలపరిచారు. 'క్విట్ జగన్-సేవ్ ఏపీ' అనేది ప్రధాన నినాదంగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో.. యువత, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పునరుద్ఘాటించారు. మరో వందేళ్లకు సరిపడా నాయకత్వాన్ని అందించేలా ప్రణాళికతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. వైకాపా పాలనలో30ఏళ్లు వెనక్కివెళ్లిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకుందామని రాజకీయ తీర్మానంలో తెలుగుదేశం పేర్కొంది.

ఇదీ చదవండి :

Last Updated : May 28, 2022, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.