అనుమానంతో కట్టుకున్న భార్యని గొడ్డలితో నరికి కడతేర్చిన సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నర్సాయపాలెంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం నర్సాయపాలెం గ్రామానికి చెందిన చిన్న రాజయ్య, పుల్లలచెరువు మండలం తెల్లగట్ల గ్రామానికి చెందిన బలగురవమ్మ(40)లకు 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదుగురు కుమార్తెలు కాగా అందులో ఇద్దరికి వివాహాలయ్యాయి. రాజయ్యకు భార్యపై అనుమానం ఉండటంతో దంపతులిద్దరూ తరచూ గొడపడేవారు. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తలు తాము సాగు చేస్తున్న పొలానికి వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన చిన్న రాజాయ్య అక్కడే ఉన్న గొడ్డలితో భార్యపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందగా రాజయ్య పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: