ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయలక్ష్మిపురం సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకొచ్చింది. అలల తాకిడికి ఒడ్డుకు చేరింది. తెప్పపై శ్రీలంకకు చెందిన ఆనవాళ్లతో ఉన్న ఆ మందిరాన్ని చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మందిరాన్ని పరిశీలించారు. మందిరంపై ఉన్న జెండా ఆనవాళ్లపై ఆరా తీశారు. మందిరం లోపల పది నుంచి 12 కిలోల బరువున్న రాగి, ఇతర లోహలతో తయారుచేసిన ఓ స్వామి విగ్రహం ఉందని... పక్కనే ఓ అగ్గిపెట్టపై శ్రీలంక అని ముద్రించి ఉందని గ్రామస్తులు చెపుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇవీ చదవండి: