ప్రకాశం జిల్లా చీరాలలో ఫ్లెక్సీల వివాదం నెలకొంది. దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గీయులు ఫ్లెక్సీల ఏర్పాటు చేసే విషయంలో వివాదం చెలరేగింది. దీంతో గడియార స్తంభం కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద పోలీసులు ప్రత్యేక బలగాలు మోహరించి... భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ఎమ్మెల్యే కరణం బలరాం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, 10గంటల తర్వాత నుంచి ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులకు కార్యక్రమం జరుపుకునేందుకు పోలీసులు అవకాశం ఇచ్చారు.
ఇదీ చదవండి: పనికి పంపితే గర్భవతిని చేశాడు...