Bike Accident: ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఓ యువకుడు అతివేగంతో ప్రమాదం కొనితెచ్చుకున్నాడు. అతివేగంగా వాహనం నడిపిన యువకుడి పొట్టలోకి చేతి పంపునకు ఉండే హ్యాండిల్ దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందిన ఈర్ల నాగరాజు అనే యువకుడు బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై మితిమీరిన వేగంతో ఇంటికి వెళుతుండగా రాజీవ్ కాలనీ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బోరింగ్ (చేతి పంపు) ను ఢీకొంది. దీంతో ఫలితంగా చేతిపంపునకు ఉండే హ్యాండిల్ హనదారుని పొట్టలోకి దూసుకువెళ్లి అవతల వైపునకు వచ్చింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి, యువకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న 108 వాహన సిబ్బంది హుటాహుటిన వెల్డింగ్ కట్టర్‌తో బోరింగ్ హ్యాండిల్‌ని రెండు వైపులా కత్తిరించి వెంటనే ఒంగోలు కిమ్స్ వైద్యశాలకు తరలించారు. కిమ్స్ వైద్యులు, శస్త్ర చికిత్స చేసి పొట్టలో ఉన్న బోరింగ్ హ్యాండిల్ ముక్కను బయటకు తీశారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇవీ చదవండి: