ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ఇసుక దర్శి వద్ద బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలోని నేరేడు పండ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా మారాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఈ వాహనం యాక్సల్ విరగటంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టంది. ఈ క్రమంలో బొలెరో బోల్తా పడి.. కాయలన్నీ నేలపాలయ్యాయి. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా హైవే సిబ్బంది క్రమబద్దీకరించారు.
ఇదీ చదవండీ.. అనకాపల్లిలో వంతెన కూలిన ఘటనపై కేసు నమోదు