ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలంలో అచ్చు బొమ్మ ఆడుతున్న శిబిరంపై పోలీసులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని టి. చెర్లోపల్లి గ్రామ పరిసరాల్లో అచ్చు బొమ్మ అడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అచ్చు బొమ్మ ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 76 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: గళమెత్తి పోరాటం చేయటమనేది తెలంగాణ ప్రజల్లో ఉంది: పవన్