ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. రెండు వేర్వేరు ఘటనల్లో మద్యం దొరక్క శానిటైజర్లు తాగి 13 మంది పేదలు మృతి చెందారు. మత్తుకు బానిసలై విషాన్ని నరనరాల్లోకి ఎక్కించుకుని ప్రాణాలను బలిచేసుకున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో 13 మంది పిట్టలు రాలినట్లు రాలిపోయారు.
బిచ్చగాళ్ల మృతితో బయటకు..
ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన ఇద్దరు యాచకులు గురువారం మృతి చెందారు. వారి మృతికి శానిటైజర్ తాగడమే కారణమని తేలింది. శుక్రవారం మరో 8 మంది మృత్యువాతపడ్డారు. వీరు కూడా శానిటైజర్ తాగడం వల్లే మృతి చెందారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. గంటల వ్యవధిలో 10 మంది మృతి చెందటంతో ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
మరో ఘటనలో ముగ్గురు
కురిచేడులో ఘటన తరహాలోనే జిల్లాలోని పామూరులోనూ మరో ఘటన జరిగింది. మందు దొరక్క శానిటైజర్లు తాగి ముగ్గురు ప్రాణాలు వదిలారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నానికి ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి మొత్తం 13 మంది మృతి చెందారు.
సంఘటన పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీరందరూ ఒకేసారి ఎలా మృతి చెందారు?..శానిటైజర్లు ఎక్కడ కొన్నారు?.. వాటిల్లో లోపాలు ఏమైనా ఉన్నాయా? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి