ప్రకాశం జిల్లా దర్శి మండలం చింతలపాలెం సమీపంలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు టైరు పగిలి బోల్తా పడింది. ఈ ఘటనలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 12 మంది విద్యార్థులు ఉన్నారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి సమీప తరలించారు.
మంత్రి ఆగ్రహం
బస్సు బోల్తా పడిన ఘటనపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల పరిస్థితిపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల బస్సులకు ఫిట్నెస్ లేకున్నా... నిబంధనలు పాటించకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
ఇదీ చూడండి : సివిల్ వివాదంలో ఎస్సై జోక్యం... ముగ్గురు రైతుల ఆత్మహత్యాయత్నం...